Friday, March 29, 2024

ఏ మొఖం పెట్టుకుని బిజెపి ఓటు అడుగుతది? : కెటిఆర్

- Advertisement -
- Advertisement -

TRS Working President KTR Fires On BJP

హైదరాబాద్: టిఆర్ఎస్ పార్టీ పుట్టి రెండు దశాబ్దాలు కావస్తోందని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ అన్నారు. ఎన్నో ఒడుదుడుగుల ఎదుర్కొని పార్టీని విజయపథంలో నడిపించిన నాయకుడు కెసిఆర్ అని కెటిఆర్ తెలిపారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభించినపప్పుడు కెసిఆర్ ఒక్కడే కులబలం లేదు.. మనీ పవర్ లేదు.. మీడియా పవర్ లేకున్నా.. సంకల్ప బలంతో ప్రయాణాన్ని ప్రారంభించారని మంత్రి పేర్కొన్నారు. పదవులను గడ్డి పోచల్లా వదిలేసి.. ఉద్యమాన్ని మొదలుపెట్టిన నాయకుడు కెసిఆర్ అని కెటిఆర్ గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమంలో ప్రజలను ఏకతాటిపైకి తెచ్చి.. తెలంగాణ వస్తదా అన్న స్థితి నుంచి తెలంగాణ తీసుకురావడమే కాకుండా, ఇప్పుడు దేశంలోనే తెలంగాణను సగర్వంగా నిలబెట్టిన నాయకుడు సిఎం కెసిఆర్ కొనియాడారు. ప్రాణాలకు తెగించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కెసిఆర్ ది అని మంత్రి పేర్కొన్నారు. కుసంస్కారంతో కొంతమంది నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు.

నోటికొచ్చినట్టు మాట్లాడేముందు సిఎం కెసిఆర్ చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని ఆయన హెచ్చరించారు. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేసిన ఘనత సిఎం కెసిఆర్ కే దక్కుతుందన్నారు. తెలంగాణ ఏర్పడక ముందు ఎస్సీలకు ఒక్క డిగ్రీ కాలేజీలు లేవు. టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినంక ఎస్సీలకు 30, ఎస్టీలకు 22 డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేశామని మంత్రి కెటిఆర్ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 192 మైనార్టీ, 261 బిసి గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసినం. కొత్తగా 5 ఐఐఎంలు మంజూరు అయితే.. కేంద్రం తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. 84 నవోదయ పాఠశాలలు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణకు వచ్చింది గుండుసున్న అని మంత్రి ఎద్దేవా చేశారు. ఐఐటి, ఐఐఎం, ఎన్ఐటి, నోవదయ పాఠశాలలు, మెడికల్ కాలేజీలు ఒక్కటి ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పడు ఏ మొఖం పెట్టుకుని తెలంగాణ విద్యార్థులను బిజెపి ఓటు అడుగుతది.? కెటిఆర్ ప్రశ్నించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News