Search
Friday 21 September 2018
  • :
  • :

టిఆర్టి సవరణ నోటిఫికేషన్ జారీ

ts
హైదరాబాద్: ఉపాధ్యాయ నియామక పరీక్ష సవరణ నోటిపికేషన్‌ను టిఎస్‌పిఎస్‌సి జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు పాత పది జిల్లాల ప్రాతిపదికన టిఫికేషన్‌ను జారీ చేసింది. అభ్యర్థులు ఈ నెల 30వ తేదీ వరకు తమ దరఖాస్తులను సుకోవచ్చని, ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. అయితే పాత జిల్లాలకు అనుగుణంగా తమ దరఖాస్తులను మార్చుకోవాలని సూచించింది. ఈ నెల 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తులో మార్పుచేసుకోవచ్చు. ఇక న్యాయస్థానం ఆదేశాలను అనుసరించి ప్రత్యేక బిఇడి, డిఇడి అభ్యర్థులకు దరఖాస్తు చేసుకునేందుకు ఆవకాశం కల్పిస్తున్నట్లు టిఎస్‌పిఎస్‌సి పేర్కొంది.

Comments

comments