Home జాతీయ వార్తలు గుడిసెలోకి దూసుకెళ్లిన లారీ: బాలుడి మృతి

గుడిసెలోకి దూసుకెళ్లిన లారీ: బాలుడి మృతి

 Road Accident

 

లక్నో: ఉత్తర ప్రదేశ్ లోని ఘాజిపూర్ ప్రాంతంలో ఆదివారం ఉదయం లారీ బీభత్సం సృష్టించింది. లారీ గుడిసెలోకి దూసుకెళ్లడంతో పదేళ్ల బాలుడు దుర్మరణం చెందాడు. ఈ ప్రమాదంలో బాలుడు అక్క తీవ్రంగా గాయపడింది. ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు అమన్ గా గుర్తించారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. 

 

Truck Enter into Hut in UttarPradesh