Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

పారిస్‌పై ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు

donaldtrumphవాషింగ్టన్ : పర్యావరణ పరిరక్షణ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్రమోడీ సహా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు మద్దతు తెలిపిన చారిత్రక పారిస్ పర్యావరణ ఒప్పందంపై రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పారిస్ ఒప్పందం వల్ల అమెరికాకు 5.3 ట్రిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుందని ఆయన పేర్కొన్నారు. తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే ఆ ఒప్పందాన్ని రద్దు చేస్తానని ఆయన ప్రకటించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా ఫ్లోరిడాలోని ఓ ర్యాలీలో ట్రంప్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పారిస్ ఒప్పందం గురించి మాట్లాడారు.

Comments

comments