Search
Saturday 22 September 2018
  • :
  • :

వచ్చే నెల హెల్సింకిలో ట్రంప్‌పుతిన్ భేటీ

int

వాషింగ్టన్: అమెరికా అ ధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను వచ్చే నెల లో భేటీ కానున్నారు. జూలై 16న వీరిరువురు ఫిన్లాండ్‌లోని హెల్సింకి లో సమావేశమవుతారని ఒక ప్రకటన వెలువడింది. ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్‌ను కలిసిన కొద్ది రోజుల్లోనే పుతిన్‌తోనూ ట్రంప్ సమావేశం కానుండడం గమనార్హం. ‘నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా. రష్యా, చైనా, ఇంకా అన్ని దేశాలతో కలిసి ఉండడం చాలా మంచి విషయం. ఇది ప్రపంచానికి మంచిది. మాకూ మంచిది. ఇది అందరికీ మంచి విషయం. కాబట్టి నా యూరప్ పర్యటనలో బహుశా మేము కలిసే అవకాశం ఉండొచ్చు’ అని ట్రంప్ విలేకరులకు వెల్లడించిన గంటల వ్యవధిలో సమావేశం వేదికను కూడా ఖరారు చేయడం గమనార్హం ట్రంప్ జులై 11, 12 తేదీల్లో ట్రంప్ బ్రస్సెల్స్‌లో జరిగే నాటో సదస్సుకు హాజరుకానున్నారు. అప్పుడే పుతిన్‌ను కలవనున్నారు. అలాగే లండన్ వెళ్లి బ్రిటన్ ప్రధాన మంత్రి థెరిసా మేతోనూ సమావేశం కానున్నారు.

Comments

comments