Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

మరింత ఆయిల్‌కు సౌదీ సమ్మతి : ట్రంప్

trumph

వాషింగ్టన్ : చమురు ఉత్పత్తిని పెంచాలని అమెరికా చేసిన అభ్యర్థనకు  సౌదీ అరేబియా అంగీకారం తెలిపింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ శనివారం వెల్లడించారు. ఇరాన్ ఆయిల్‌ను దిగుమతి చేసుకోరాదని ప్రపంచ దేశాలపై అమెరికా ఒత్తిడి తీసుకువస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలోనే ట్రంప్ స్వయంగా సౌదీ రాజు సల్మాన్‌తోపై అత్యవసర ప్రాతిపదికన ఫోన్‌లో మాట్లాడారు. తాను సౌదీ కింగ్‌తో అన్ని అంశాలను మాట్లాడినట్లు, ఇరాన్, వెనిజులా వంటి చమురు ఉత్పత్తి దేశాలతో తలెత్తుతున్న సమస్యలు అక్కడ నెలకొంటున్న సంక్షో భం వంటివాటిని ప్రస్తావించినట్లు ట్రంప్ వివరించారు. చమురు లోటు రాకుండా సౌదీ అరేబియా తక్షణం స్పందించి కనీసం రెండు లక్షల బ్యారెల్స్‌ను అధికంగా ఉత్పత్తి చేయాల్సి ఉందని ట్రంప్ అభ్యర్థించారు. దీని వల్ల లోటు రాకుండా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ధరలు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో సరైన స్పందన కావాలని కోరానని అందుకు సౌదీ కింగ్ సానుకూలంగా స్పందించారని ట్రంప్ తెలిపారు.

Comments

comments