Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ఇరాన్ అధ్యక్షుడికి ట్రంప్ హెచ్చరిక

trump
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా, ఇస్లామిక్ దేశం ఇరాన్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అమెరికాను భయపెట్టడానికి చూస్త్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని ఇరాన్ అధ్యక్షుడు హస్సన్ రౌహానిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్‌లో హెచ్చరించారు. సింహంతో ఆటలు వద్దని, ఇరాన్‌తో యుద్ధమంటే మాటలు కాదని రౌహాని ఆదివారం ట్రంప్‌ను హెచ్చరించిన విషయం తెలిసిందే. దీనిపై ట్రంప్ తీవ్రంగా స్పందిస్తూ ‘ అమెరికాను బెదిరించాలని చూడకండి.. మీరు బెదిరిస్తే భయపడే దేశం కాదు మాది. అమెరికా ఎప్పుడూ ఎవరికీ భయపడదు, మరోసారి అమెరికాను బెదిరిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది’ అని ట్విట్టర్‌లో ఘాటుగా హెచ్చరించారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలు మానసిక యుద్ధంలో భాగం మాత్రమేనని, ఇరాన్‌పై చర్య తీసుకునే స్థితిలో ఆయన లేరని ఇరాన్ బాసిజ్ మిలీషియా చీఫ్ జనరల్ గులామ్ హొస్సేన్ ఘ్యేపౌర్ వ్యాఖ్యానించారు. ఇరాన్ ఉగ్రవాదులకు సహకరిస్తోందని ఆరోపిస్తూ అమెరికా ఆ దేశంతో కుదుర్చుకున్న అణుఒప్పందం నుంచి ఇటీవల వైదొలగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అమెరికా ఇరాన్‌పై ఆంక్షలు విధించడం ద్వారా దాన్ని లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఈ క్రమంలోనే రెండు దేశాలు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం తీవ్రమైంది.

Comments

comments