Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

చెప్పింది చేయకపోతే అమెరికా షట్‌డౌన్

మెక్సికో వాల్.. ఇమిగ్రేషన్ బిల్లుపై ట్రంప్ వార్నింగ్

If you type idiot in Google trump images is coming

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం ఏకంగాతమ దేశంలోని ప్రభుత్వాన్నే స్తంభింపచేస్తామని హెచ్చరించారు. ఇమిగ్రేషన్ చట్టాలలో తాను తలపెట్టిన మార్పులకు ప్రతిపక్ష డెమొక్రాట్లు అంగీకరించాలని డిమాండ్ చేశారు. ఇందుకు వారు అంగీకరించకపోతే షట్‌డౌన్ తప్పదని, ఫెడరల్ ప్రభుత్వం స్తంభించిపోతుందని ట్రంప్ హెచ్చరించారు. కేవలం వలసవాద విధానాలలో కీలక మార్పులే కాకుండా మెక్సికోతో సరిహద్దు విషయంలో నిధులకు చట్టసభలు అంగీకరించకపోతే ప్రభుత్వాన్ని షట్‌డౌన్ చేస్తామని ట్రంప్ తెలిపారు. సరిహద్దు భద్రతకు తమ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని, ఇక ప్రత్యేకించి దేశంలోకి విదేశీయుల వలస, వారికి స్థిర నివాసం కల్పన వంటి అంశాలలో తాము జాతీయవాదంతో వ్యవహరిస్తున్నామని, అయితే కాంగ్రె స్ నుంచి తగు విధంగా నిధుల మంజూరికి అనుమతి రాకపోతే ప్రభుత్వాన్ని స్తంభింపచేయడమే తమ ముం దున్న తక్షణ కర్తవ్యం అని ట్రంప్ తమ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. వాల్, వీసాలకు సంబంధించిన లాటరీ, నిర్బంధాలు, తరువాత విముక్తి వంటి ఘట్టాలు అన్నీ వైదొలగాలి.

పూర్తిగా ప్రతిభ ఆధారిత వీసా ఇమిగ్రేషన్ వ్యవస్థకు వెళ్లదల్చినట్లు, ఈ దేశంలోకి అత్యుత్తములు, గొప్పవాళ్లు రావాలనేదే తమ కోరిక అని ట్రంప్ స్పష్టం చేశా రు. ఇమిగ్రేషన్ అంశాలకు సంబంధించిన చట్టాన్ని కాంగ్రెస్ ఆమోదించాలని ట్రంప్ పట్టుపడుతున్నారు.  కాంగ్రెస్‌పై రిపబ్లికన్ల ఆధిపత్యం ఉన్నప్పటికీ   పార్టీలోని మితవాదులు, కన్సర్వేటివ్‌ల మధ్య ఏకాభిప్రాయ సాధ న లేకపోవడంతో చట్టం తేవడంలో జాప్యం ఏర్పడుతోందని ట్రంప్ పేర్కొన్నారు. కన్సర్వేటివ్ రిపబ్లికన్లు ప్రతిపాదించిన ఇమిగ్రేషన్ బిల్లు గత వారంలో సభలో ఆమోదం పొందలేకపోయింది. మెక్సికోకు అడ్డుగా సరిహద్దులలో భారీ గోడ నిర్మాణానికి అవసరమైన 25 బిలియన్ డాలర్ల నిధులు మంజూరీ బిల్లుకు ఆమోదం తెలియచేయాలని ట్రంప్ చట్టసభలను కోరారు.

అయితే 1.6 బిలియన్ డాలర్లను ఇందుకోసం అనుబంధ బడ్జెట్ పద్దులో పెట్టారని, ట్రంప్ అభ్యర్థన మేరకు మరో 5 బిలియన్‌డాలర్ల నిధుల విడుదల అంశాన్ని సెనెటర్లు పరిశీలిస్తారని గతవారం యుఎస్ హౌస్ స్పీకర్ పౌల్ ర్యాన్ చెప్పారు. అయితే అత్యవసర ప్రాతిపదికన అనుబంధ బిల్లుల చెల్లింపులకు అవకాశం ఉంటుందా? అనేది నిర్థారించుకోవల్సి ఉందని చట్టసభ సభ్యులు పేర్కొంటున్నారు. అయితే ఇప్పుడు ట్రంప్ ఉన్నట్లుండి దేశాన్ని తాత్కాలికంగా బంద్ అవస్థలకు గురి చేస్తామని చెప్ప డం విస్మయాలకు దారితీసింది. చాలా కాలంగా వాల్ కోసం, ఇమిగ్రేషన్ సవరణల కోసం పట్టుపడుతున్నానని, త్వరలోనే కాంగ్రెస్‌కు తమ సత్తా ఏమిటనేది షట్‌డౌన్‌తో తెలియచేస్తామని ట్రంప్ హెచ్చరించారు.

Comments

comments