Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

ట్రంప్ వ్యక్తిగత కార్యదర్శి రాజీనామా

HOPES

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత కార్యదర్శి, వైట్ హౌజ్ కమ్యూనికేషన్ డైరెక్టర్ హోప్ హిక్స్ తన పదవికి రాజీనామా చేశారు. 2016లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై హౌస్ ప్యానెల్ బుధవారం విచారణ జరిపిపింది. విచారణ జరిపిన మరుసటి రోజే ఆమె రాజీనామా చేయడంతో ట్రంప్‌కు పెద్ద షాక్ తగిలినట్లయింది. విచారణ, ఇతర వ్యక్తిగత కారణాల వల్ల తాను రాజీనామా చేసినట్లు హోప్ తెలిపారు. మూడేళ్లుగా ఆమె ట్రంప్‌కు అంతరంగికురాలుగా ఉన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఇమేజ్ పెంపొందించేందుకు ఆమె ప్రచారం చేశారు. మాజీ మోడల్ అయిన హోప్ గతంలో ట్రంప్ కూతురు ఇవాంక కోసం పని చేసిన విషయం తెలిసిందే. ట్రంప్‌తో ఆమెకు దగ్గర సంబంధాలు ఉండడంతోనే రాబర్ట్ ముల్లర్ ఆధ్వర్యంలోని ప్రత్యేక కౌన్సిల్ హోప్‌ను సుధీర్ఘంగా ప్రశ్నించింది. దీంతో కలత చెందిన హోప్ తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. రష్యా దర్యాప్తు విషయంలో ఆమె ట్రంప్‌కు అబద్ధాలు చెప్పేదని హౌస్ ఇంటలిజెన్స్ ప్యానెల్ చెబుతోంది. తాను ఎటువంటి అబద్ధాలు చెప్పలేదని హోప్ తేల్చి చెప్పారు. ఆమె రాజీనామాపై ట్రంప్ కార్యాలయం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. భవిష్యత్‌లో ఆమెను మళ్లీ కొనసాగించే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు ట్రంప్ కార్యాలయం ఓ ప్రకటన చేసింది. దీంతో ఆమె మళ్లీ తన పాత హోదాలో కొనసాగే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Trump’s Personal Secretary Resigns

Comments

comments