Home తాజా వార్తలు ఎదురు తిరిగిన ‘రద్దు’

ఎదురు తిరిగిన ‘రద్దు’

supreme court

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీకి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. అసెంబ్లీ రద్దను సవాల్ చేస్తూ కాంగ్రెస్ లీడర్ డికె అరుణ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. హైకోర్టు ఇటీవలే ఈ పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో సుప్రీంకోర్టు వెళ్లినా కాంగ్రెస్ కు అక్కడ కూడా చుక్కెదురైంది. ఓటర్ల జాబితాపై దాఖలైన పిటిషన్లను కూడా హైకోర్టు, సుప్రీంకోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. వరుస పరాభవాలతో కాంగ్రెస్ నాయకులు కన్‌ఫ్యూజన్‌లో పడ్డారు.

సాకులు వెతుకుతున్నా కొద్ది కాంగ్రెస్‌కు దెబ్బ మీద దెబ్బతగులుతోంది. కోర్టుల్లో పరాభవంతో దిక్కతోచని స్థితిలో కాంగ్రెస్ ఉంది. మొన్నటి వరకు రైతుబంధు, బతుకమ్మ చీరల పంపిణీని కాంగ్రెస్ నేతలు అడ్డుకున్న విషయం విదితమే. ఇక చేసేదేమీ లేక ఇటు పోలీసులు, అటు ఇసిపై మహా కూటమి నేతలు అనవసర ప్రచారాలు చేస్తున్నారు. తెలంగాణలో ఓటమి తప్పదని తెలిసే టిఆర్‌ఎస్‌పై ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని టిఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు.

TS assembly dissolution SC dismisses congress plea

telangana latest news