Home కెరీర్ తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల

తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల

TS-EAMCET-2018హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి సోమవారం విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం మంగళవారం ఎంసెట్ నోటిఫికెషన్ విడుదల కానుంది. మార్చి 4 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అవుతోంది. దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 4. మే 2, 3 తేదీల్లో ఎంసెట్ మెడికల్ పరీక్ష ఉంటుంది. అలాగే మే 4, 5, 7 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్ష ఉండనుంది.