Home రాష్ట్ర వార్తలు హన్మకొండ కాళోజీ కళా కేంద్రానికి రూ. 50 కోట్లు

హన్మకొండ కాళోజీ కళా కేంద్రానికి రూ. 50 కోట్లు

Pervarmమన తెలంగాణ/హైదరాబాద్ : ప్రజాకవి కాళోజి  నారాయణరావు స్మారకార్ధం  వరంగల్ జిల్లా హనుమకొండలో ‘కాళోజి కళా కేంద్రం’ ఏర్పాటుకు ప్రభుత్వం  రూ 50 కోట్లు కేటాయిస్తూ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసిందని రాష్ట్ర పర్యాటక అభివృధ్ది కార్పొరేషన్ చైర్మన్ పేర్వారం రాములు తెలిపారు. పర్యాటక భవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కార్పొరేషన్ ఎండి క్రిస్టినాజడ్‌చుంగ్తు, ఇడి సుమిత్  సింగ్, మేనేజర్ పురంధర్ లతో కలిసి ఆయన మాట్లాడారు. తొలి దశలో రూ 10 కోట్లు విడుదల చేశారని వెల్ల డించారు. అలాగే 2016-17 బడ్జెట్‌లో రూ 20 కోట్లు, 2017-18 లో మరో రూ 20 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు.  మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న కళాకేంద్ర నిర్మాణానికి జనవరి 2016 లో   టెండర్లు పిలవనున్నామని 2018 సంవత్సరాంతానికి నిర్మాణం పూర్తి చేస్తామని  పేర్వారం వెల్లడించారు. వాస్తుశిల్పి హఫీజ్ కాంట్రాక్టర్ దీనికి రూపకల్పన చేయగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఆమోద ముద్ర వేశారని వెల్లడించారు. బహుళార్ధక సాంస్కృతిక కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. నాలుగు అంతస్తులుగా సాగే నిర్మాణం 70 అడుగుల ఎత్తులో ఉంటుందని తెలిపారు.ఏక కాలంలో 1100 మంది ప్రేక్షకులు హాలు లో,మొదటి అంత స్థులో కూర్చుని ప్రదర్శనలను తిలకించవచ్చని తెలిపారు.