Home ఆఫ్ బీట్ తెలంగాణ ఐసెట్-2018 ఫలితాలు విడుదల

తెలంగాణ ఐసెట్-2018 ఫలితాలు విడుదల

TS ICET 2018 Results Declared

హైదరాబాద్: తెలంగాణ ఐసెట్-2018 ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది మొత్తం 55, 199 మంది పరీక్ష రాయగా, 49, 812 మంది ఉత్తీర్ణత సాంధించారు. 90.25 శాతం ఉత్తీర్ణత నమోదైంది. హైదరాబాద్‌కు చెందిన తాటి సత్య ఆదిత్య 164 మార్కులతో తొలిర్యాంక్ సాధించగా, ఎల్చూరి సాయిసందీప్ 163 మార్కులతో రెండో ర్యాంక్ దక్కించుకున్నాడు. 162 మార్కులతో నవీన్ కుమార్ మూడో ర్యాంకర్‌గా నిలిచాడు. 15 రోజుల్లో ఐసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుందని సమాచారం.

TS ICET 2018 Results Click Here

TS ICET 2018 Results Click Here