Home తాజా వార్తలు తెలంగాణ ఎన్నికలు: కిక్కిరిసిన ప్రయాణ ప్రాంగణాలు

తెలంగాణ ఎన్నికలు: కిక్కిరిసిన ప్రయాణ ప్రాంగణాలు

 

హైదరాబాద్‌: తెలంగాణలో రేపు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకొనేందుకు నగరవాసులు సొంతూళ్లకు బయల్దేరారు. దీంతో పలు ప్రయాణ ప్రాంగణాలన్నీ ప్రయాణీకులతో కిక్కిరిసిపోయాయి. సికింద్రా బాద్‌, నాంపల్లి రైల్వేస్టేషన్లతో పాటు పలు ఆర్టీసి బస్టాండ్ల నుంచి ప్రజలు తమ సొంతగ్రామాలకు వెళ్తుండడంతో ప్రయాణ ప్రాంగణాలన్నీ కిక్కిరిసిపోయి జనంతో పండుగ వాతావరణాన్ని తలపించాయి. దీంతో ఆర్టీసి యాజమాన్యం అదనంగా మరో 1200 బస్సులను వేసినట్టు ప్రకటించింది.

సిటీ బస్సులను కూడా కరీంనగర్‌, వేములవాడ, జగిత్యాల, సిరిసిల్ల బోర్డులు పెట్టి నడుపుతున్నారు. కానీ ఈ బస్సులు మాత్రం తమకు ఎంతమాత్రం సరిపోవడంలేదని, గంటలపాటు తాము ప్రయాణ ప్రాంగణాల్లో బస్సుల కోసం నిరీక్షించాల్సి వస్తోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పండుగలు, పరీక్షల సమయంలో ప్రత్యేక బస్సులు వేసే ఆర్టీసి యాజమాన్యం ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల సమయంలో బస్సులు వేయకపోవడంతో అవస్థలు పడుతున్నామని ప్రయాణికులు వాపోతున్నారు.

 

TS polls:Heavy rush at RTC Bus and Railway stations