Home తాజా వార్తలు ఈ నెల 15న టిఎస్ సెట్ పరీక్ష

ఈ నెల 15న టిఎస్ సెట్ పరీక్ష

SSC-EXAM

హైదరాబాద్: ఈ నెల 15వ తేదీన అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ లెక్చరర్‌షిప్‌కు అర్హత సాధించేందుకు నిర్వహించే తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీఎస్-సెట్)-2018 పరీక్షను నిర్వహించనున్నట్లు సెట్ మెంబర్ సెక్రెటరీ ప్రొఫెసర్ యాదవరాజు పేర్కొన్నారు.  ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.15 గంటల వరకు ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు తెలిపారు.  29 సబ్జెక్టులకు గాను 65 వేల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారని వివరించారు. బయోమెట్రిక్ హాజరును నమోదు చేయనున్నట్లు తెలిపారు. దీనికి అభ్యర్థులందరూ సహకరించాలని సూచించారు. పరీక్షా తీరును పర్యవేక్షించేందుకు తొలిసారిగా యూజిసి నుంచి ప్రత్యేక పరిశీలకులు రానున్నారని చెప్పారు.