Search
Saturday 21 July 2018
  • :
  • :

టియస్‌ఎన్‌పిడిసిఎల్ నుండి 107 జె.ఎ.ఓ పోస్టులు

TSGENCO JAO Recruitment 2018

తెలంగాణ రాష్ట్ర ఉత్తర మండల విద్యుత్తు పంపిణీ సంస్థ (టిఎస్‌ఎన్‌పిడిసిఎల్) జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ (జెఏవో) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటికి సంబంధించిన వివరాలు.
మొత్తం ఖాళీలు : 107
ఇందులో 34 ఖాళీలను మహిళలకు ప్రత్యేకించారు. ఓపెన్ కేటగిరీకి 50, బీసీలకు 3౦, ఎస్సీలకు 16, ఎస్టీలకు 7, దివ్యాంగులకు 4 ఉద్యోగాలను కేటాయించారు. కేటగిరీల వారీగా మహిళలకు 331/3 శాతం రిజర్వేషన్ అమలవుతుంది. అంటే ఓసీలకు 16, బీసీలకు 9, ఎస్సీలకు 5, ఎస్టీలకు 3, దివ్యాంగులకు 1ఖాళీలు రిజర్వు చేశారు.
మొత్తం ఖాళీల్లో 70 శాతం స్థానికులకు కేటాయించారు. మిగిలిన 30 శాతం ఖాళీలు ఓపెన్ కేటగిరీలో ఉంటాయి. వీటికోసం స్థానికేతరులతో పాటు స్థానికులు కూడా పోటీపడవచ్చు.
వయస్సు: 18 నుండి 44 ఏళ్లు (2018 జనవరి 1నాటికి ) ఎస్సీ/బీసీ అభ్యర్థులకు అయిదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు వర్తిస్తుంది.
అర్హత : ప్రథమశ్రేణి మార్కులతో బీకామ్ లేదా ఎంకామ్ లేదా సీఏ లేదా ఐసీడబ్లు(ఇంటర్)
ఎంపిక : రాత పరీక్ష ద్వారాఎంపిక చేస్తారు. ఎటువంటి ఇంటర్వూ ఉండదు. రాత పరీక్షలో వచ్చినమార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను రూపొందించి 1:1 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. రాత పరీక్షలో అర్హత మార్కులను నిర్దేశించారు. ఈ క్రమంలో జనరల్ అభ్యర్థులు 40 శాతం, బీసీ అభ్యర్థులు 35శాతం, ఎస్‌సి/ఎస్‌టి/దివ్యాంగులు 30శాతం మార్కులను సాధించాలి.
దరఖాస్తు ఫీజు:దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు
రూ. 100, ఎగ్జామ్ ఫీజు రూ.120 చెల్లించాలి.
(రిజర్వ్‌డ్ అభ్యర్థులు ఎగ్జామ్ ఫీజు చెల్లించనవసరం లేదు)
రాతపరీక్ష వివరాలు: రాత పరీక్షను ఆంగ్ల మాధ్యమంలో ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో రెండు విభాగాలు ఉంటాయి. అవి సెక్షన్‌ఎ, సెక్షన్‌బి, సెక్షన్‌ఎ నుండి 80 ప్రశ్నలు ఇస్తారు. సెక్షన్ బి లో 20 ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఇస్తారు. వీటికి 120 నిముషాల్లో (రెండు గంటలు) సమాధానాలను గుర్తించాలి.
ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది.
* సెక్షన్‌ఎ : ఇది సబ్జెక్టివ్ విభాగం. ఇందులో
అకౌంటెన్సీ అండ్ అడ్వాన్స్‌డ్ అకౌంటెన్సీ (35 మార్కులు), కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటింగ్ (25 మార్కులు), ఆడిటింగ్(20 మార్కులు)అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
* సెక్షన్ బి ఇందులో జనరల్ అవేర్‌నెస్, న్యూ మరికల్ ఎబిలిటీ విభాగాల నుండి ప్రశ్నలు ఇస్తారు. ఈ క్రమంలో అనలిటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్, కంప్యూటర్‌నాలెడ్జి, తెలంగాణ చరిత్రసంస్కృతి నుండి ప్రశ్నలు వస్తాయి.
ముఖ్యమైన తేదీలు :
* ప్రొబేషన్ రెండేళ్లు
(ఇందులో ఏడాదిపాటు ట్రైనింగ్ ఉంటుంది)
* దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
* ఫీజు చెల్లింపు ప్రారంభం : జూన్ 15, 2018
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం : జూన్ 16, 2018
* ఫీజు చెల్లింపు : దరఖాస్తుకు చివరి తేది : జూన్ 30, 2018
* హాల్ టికెట్స్ డౌన్‌లోడింగ్ ప్రారంభం :జులై 13, 2018
* రాత పరీక్ష తేది : జులై 22, 2018
* పరీక్షా కేంద్రాలు : హైదరాబాద్ జీహెచ్‌ఎంసి,
వరంగల్ జీడబ్లూఎండి పరిధి, వెబ్‌సైట్
:http://tsnpdcl.egg.gov.in

Comments

comments