Home రాష్ట్ర వార్తలు కానిస్టేబుల్ అభ్యర్థులకు 23న తుది రాత పరీక్ష

కానిస్టేబుల్ అభ్యర్థులకు 23న తుది రాత పరీక్ష

TSLPRBమన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ నోటిఫికేషన్ మేరకు కానిస్టేబుల్ అభ్యర్థులుగా ఇప్పటి వరకు నిర్వహించిన రాత, శారీరక, తదితర పరీక్షలలో అర్హత పొందిన అభ్యర్థులకు అక్టోబర్ 23వ తేదీన చివరి రాత పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ మేరకు పోలీసు నియామక బోర్డు చైర్మన్ జె. పూర్ణచందర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. మొదట రాత పరీక్ష, తర్వాత శారీరక, ఆ తర్వాత సర్టిఫికెట్ల వేరిఫికేషన్ తదితర వాటిల్లో పరీక్షలు నిర్వహించామని, అందులో ఎంపికైన అభ్యర్థులకు చివరి పరీక్షను నిర్వహిస్తున్నామని చెప్పారు. పరీక్షలో అర్హత పొందిన వారు శిక్షణకు పిలవనున్నామని ఆయన పేర్కొన్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు రాత పరీక్ష ఉంటుందని, అభ్యర్థులకు పరీక్ష కేంద్రం తదితర వివరాలన్నింటినీ హాల్ టికెట్లలో పొందుపరిచామని, అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరారు.