Home కెరీర్ పంచాయతీ కార్యదర్శుల పరీక్ష ఫలితాలు వెల్లడించొద్దు

పంచాయతీ కార్యదర్శుల పరీక్ష ఫలితాలు వెల్లడించొద్దు

ECI orders to stop the election notification process

మన తెలంగాణ/హైదరాబాద్ : తమ ఆదేశాలు వెలువడే వరకూ జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు నిర్వహించే పరీక్షల ఫలితాలను వెల్లడించరాదని హైకోర్టు మధ్యంతర ఆదేశాలిచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వయో పరిమితి ఓసీలకు 44, ఎస్సీ,ఎస్టీ, బీసీలకు 49 సంవత్సరాలుగా చేస్తూ 2017లో జీవో 199 వెలువడిందని, అయితే సదరు పోస్టుల భర్తీలో ఓసీల వయస్సు 39గా నిర్ణయించడం చెల్లదని దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు న్యాయమూర్తి నవీన్‌రావు విచారించారు. జీవో 199 ప్రకారం వయోపరిమితి పెంపును అమలు చేసే అంశాన్ని పరిశీలన చేయాలని, కోర్టును ఆశ్రయించిన వారి దరఖాస్తులను మాత్రం స్వీకరించి పరీక్షకు అనుమతించాలని మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విచారణ 4 వారాలకు వాయిదా వేసింది.

జూ. పంచాయతీ కార్యదర్శుల రాత పరీక్ష అక్టోబర్ 10కి వాయిదా పడిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 9,355 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియలో భాగంగా దరఖాస్తు గడువు గత శనివారం ముగిసింది. ఈ పోస్టులకు చివరిరోజైన శనివారం సాయంత్రంవరకు 5,69,447 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం రాత పరీక్షను అక్టోబర్ 4న నిర్వహించనున్నట్లు నియామక ప్రక్రియ కమిటీ కన్వీనర్ నీతూ ప్రసాద్ వారం క్రితం ఉత్తర్వులు కూడా జారీ చేయగా, తాజాగా పరీక్షను అక్టోబర్ 10కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన విషయం విధితమే.

TSPRI:Panchayat Secretaries Results don’t Announce

Telangana news