Home తాజా వార్తలు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫలితాలు విడుదల

ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫలితాలు విడుదల

TSPSC

హైదరాబాద్: అటవీశాఖ బీట్ ఆఫీసర్ రాత పరీక్ష ఫలితాలను టిఎస్‌పిఎస్‌సి బుధవారం విడుదల చేసింది. శారీరక సామర్థ్యపరీక్షలకు 1:3 చొప్పున 5,569 మందిని ఎంపిక చేసినట్టు పేర్కొంది. అభ్యర్థులకు జులై 2 నుంచి శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించనున్నట్టు వెల్లడించింది. పూర్తి వివరాలను వెబ్ సైట్ లో తెలుసుకోవాలని అభ్యర్థులకు టిఎస్‌పిఎస్‌సి సూచించింది.

ఎఫ్ఎస్వో అభ్యర్థుల సర్టిఫికెట్ల పరీశీలన… 

ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నియామక ప్రక్రియలో భాగంగా అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలించనున్నట్టు టిఎస్‌పిఎస్‌సిస్పష్టం చేసింది. ఫిజికల్ టెస్ట్, ఈవెంట్లలో అర్హత సాధించిన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన 26, 27 తారీఖుల్లో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఉదయం 10గంటల నుంచి జరుగుతుందని సంబంధిత అధికారలు వెల్లడించారు. అన్‌రిజర్వ్‌డ్, లోకల్, ఏజెన్సీ ఏరియా ఆప్షన్లకు 22 నుంచి 25లోగా పోస్ట్ ప్రిఫరెన్స్‌లు, వెబ్‌ఆప్షన్లు ఇవ్వాలని టిఎస్‌పిఎస్‌సి కోరింది.