Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

2,437 పోస్టుల భర్తీకి 15 నోటిఫికేషన్లు విడుదల

TSPSC Chairman Ganta Chakrapani

హైదరాబాద్: రాష్ట్ర అవతరణ దినోత్సవ దినోత్సవం సందర్భంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టిఎస్‌పిఎస్‌సి) నిరుద్యోగులకు శుభవార్త అందించింది. 15 వివిధ నోటిఫికేషన్లు విడుదల చేసి మొత్తం 2,437 పోస్టులను భర్తీ చేస్తామని టిఎస్‌పిఎస్‌సి చైర్మన్ ఘంటా చక్రపాణి ప్రకటించారు. శుక్రవారం నుంచి కొత్త నోటిఫికేషన్లను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. గురువారం టిఎస్‌పిఎస్‌సి కార్యాలయంలో కమిష న్ కార్యదర్శి ఎ.వాణిప్రసాద్, సభ్యులు సి.విఠల్, టి. వివేక్, మహ్మద్ ఖాద్రీ, కె.రామ్మోహన్ రెడ్డిలతో కలిసి ఛైర్మన్ చక్రపాణి విలేకరులతో మాట్లాడారు. గురుకుల టీచర్ పోస్టులకు విజయవంతంగా ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించా మని, ఒకటి లేదా రెండు రోజుల్లో కీ విడుదల చేస్తామని చెప్పారు. ఈ నెల 29, 30 తేదీలలో పిజిటి పోస్టులకు ,వచ్చే నెల రెండవ వారంలోగా టిజిటి పోస్టులకు మెయిన్స్ పరీక్షలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. అలాగే జూన్ 30న క్రాఫ్ట్ టీచర్, ఆర్ట్ టీచర్, లైబ్రేరియన్ తదితర పోస్టులకు పరీక్ష నిర్వ హించనున్నట్లు తెలిపారు.

వెబ్‌సైట్‌లో గ్రూప్-1,2 ఫలితాలు : గ్రూప్-1, గ్రూప్-2 ఫలితాలను శుక్రవారం నుంచి టిఎస్‌పిఎస్‌సి వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నట్లు చైర్మన్ వెల్ల డించారు. గ్రూప్-1కు సంబంధించి 1ః2 నిష్పత్తిలో 128 పోస్టులకు 256 మందికి ఎంపిక చేసినట్లు తెలిపారు. వారం పది రోజుల్లో సర్టిఫికెట్ వెరి ఫికే షన్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.అలాగే గ్రూప్-2కు సంబంధించి 1,032 పోస్టులకు 1ః3 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు పిలుస్తున్నామని చెప్పారు. 10-15 రోజుల వ్యవధిలో గ్రూప్-1 తర్వాత గ్రూప్-2కు ఇంట ర్వూలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఉద్యోగార్థులు మధ్యదళారుల ను, పైరవీకారులను నమ్మవద్దని కోరారు. అభ్యర్థులు అవసరమైన సర్టిఫికెట్లు అన్ని సిద్దం చేసుకోవాలని తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర కులం ధృవీకరణ పత్రం, బిసి అభ్యర్థులైతే నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్లు సిద్దం చేసుకోవాలని, సర్టిఫికెట్లు లేనివారికి ఎలాంటి గడువు ఇవ్వమని స్పష్టం చేశారు. టిఎస్ పిఎస్‌సి ఇప్పటివరకు 15 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసింద ని, అందులో 6 వేల పోస్టులకు భర్తీ ప్రక్రియ పూర్తయిందని అన్నారు. ఇప ్పటివరకు ప్రభుత్వం తమకు ఇచ్చిన ఇండెంట్లకు మొత్తం నోటిఫికేషన్లు జారీ చేశామని, తమ వద్ద పెండింగ్ ఇండెంట్లు లేవని తెలిపారు.

జిఒ వచ్చిన తర్వాత టీచర్ పోస్టుకు నోటిఫికేషన్ : ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి విద్యాశాఖ నుంచి జిఒ విడుదలైన తర్వాత కసరత్తు మొదలవుతుందని ఘంటా చక్రపాణి తెలిపారు. టీచర్ పోస్టులకు సంబంధించి ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఇండెంట్ అందలేదని అన్నారు. ఖాళీల వివరాలు తమకు అందిన తర్వాత నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు.

టిఎస్‌పిఎస్‌సి విడుదల చేసిన కొత్త  నోటిఫికేషన్ల వివరాలు: 

గురుకుల డిగ్రీ కళాశాలలలో లెక్చరర్లు- 546
గురుకుల డిగ్రీ కళాశాలల్లో ఫిజికల్ డైరెక్టర్లు- 21
గురుకుల డిగ్రీ కళాశాలల్లో లైబ్రేరియన్లు- 21
గురుకుల జూనియర్ కళాశాలల్లో ప్రిన్సిపాల్- 6
గురుకుల జూనియర్ కళాశాలల్లో ఫిజికల్ డైరెకర్- 8
గురుకులాల్లో జూనియర్ లెక్చరర్లు- 152
గురుకుల జూనియర్ కళాశాలల్లో లైబ్రేరియన్లు- 42
గురుకుల పాఠశాలల్లో ప్రిన్సిపాల్- 304
పశుసంవర్థక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్- 541
వివిధ శాఖల్లో అసిస్టెంట్ ఇంజనీర్లు(సివిల్,ఎలక్ట్రికల్,మెకానికల్)- 463
పశుసంవర్థకశాఖలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్- 7
బాయిలర్స్ విభాగంలో ఇన్‌స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్- 4
డిప్యూటీ సర్వేయర్లు- 273
గురుకుల డిగ్రీ కళాశాలల్లో ప్రిన్సిపాల్- 30
ములుగు ఫారెస్ట్ కళాశాలలో ప్రొఫెసర్లు, లైబ్రేరియర్లు- 19

Comments

comments