Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

అదనంగా 495 ఎఇ పోస్టులు

tspsc2దరఖాస్తు గడువు 28వ తేదీ
మన తెలంగాణ/ హైదరాబాద్ : పబ్లిక్ సర్వీస్ కమిషన్ అసిస్టెంట్ ఇంజినీర్ (ఎఇ) పోస్టుల భర్తీ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్‌కు అదనంగా మరో 495 పోస్టులను కలుపుతూ అను బంధ నోటిఫికేషన్ విడుదల చేసింది. గతంలో 563 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం కలిపి 1058 పోస్టులకు నోటిఫికేషన్ విడు దల చేసినట్లయింది. వీటన్నంటికి ఈనెల 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని టిఎస్‌పిఎస్‌సి కార్యదర్శి పార్వతి సుబ్రమణ్యయన్ ఒక ప్రకటన లో తెలిపారు. పెరిగిన పోస్టుల్లో నీటిపారుదల శాఖలో సివిల్ ఇంజినీరింగ్ అర్హతతో 226 పోస్టు లు, మెకానికల్ అర్హతతో 26 పోస్టులున్నాయి. పంచాయతీరాజ్, ఆర్‌డబ్లుఎస్ శాఖలో 243 పోస్టులున్నాయి. వీటన్నంటికి డిప్లొమా చేసిన అభ్యర్థులు అర్హులు. అక్టోబర్ 25న రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇంజినీరింగ్, డిప్లొమా అర్హతతో దాదాపు 2వేల పోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్ రావడంతో నిరుద్యోగులు ఉత్సాహంగా ఉన్నారు.

Comments

comments