Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

టిఎస్‌పిఎస్‌సి తొలి ఉద్యోగ ప్రకటన విడుదల

tspsc2హైదరాబాద్: తెలంగాణలో నిరుద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఉద్యోగ నియామక ప్రకటనలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. టిఎస్‌పిఎస్‌సి ఏర్పడ్డాక తొలి ఉద్యోగ ప్రకటన బుధవారం విడుదలైంది. సహాయ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఎఇఇ) ఉద్యోగాలకు టిఎస్‌పిఎస్‌సి అధ్యక్షుడు ఘంటా చక్రపాణి నోటిఫికేషన్ విడుదల చేశారు. దీని ద్వారా మొత్తం 3783 ఎఇఇ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ సందర్భంగా చక్రపాణి మాట్లాడుతూ… ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొవటానికి రెండువారాల సమయం ఇస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకొవటానికి చివరి గడువు సెప్టెంబర్ 3 అని తెలిపారు. అంతేకాక సెప్టెంబర్ 20న కామన్ పరీక్ష ఉంటుందని చెప్పారు.

Comments

comments