Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

గ్రూప్ 4, విఆర్‌వొ, ఎఎస్‌వొ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ

tspsc

హైదరాబాద్: గ్రూప్ 4, విఆర్ వొ, ఎ ఎస్ వొ పోస్టుల భర్తీకి టిఎస్‌పిఎస్‌సి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 2,786 పోస్టుల భర్తీకి టిఎస్ పిఎస్ సి ఉద్యోగ భర్తీకి ప్రకటన ఇచ్చింది. ఆర్ టిసి లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు జూన్ 7 నుంచి జూలై 6వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరిస్తారు. అక్టోబర్ 7 న పరీక్ష నిర్వహించనున్నారు. ఎఎస్ వొ పోస్టులకు ఈ నెల 8 నుంచి జూలై 2వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని వెల్లడించింది. సెప్టెంబర్ 2న పరీక్ష నిర్వహించడం జరుగుతుందని స్పష్టం చేశారు. అదేవిధంగా విఆర్ వొ ఉద్యోగాలకు జూన్ 8 నుంచి జూలై  2వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. సెప్టెంబర్ 16న రాత పరీక్ష జరగనుంది.

Comments

comments