Home తాజా వార్తలు విఆర్ఒ మెరిట్ జాబితా విడుదల

విఆర్ఒ మెరిట్ జాబితా విడుదల

tspsc

 

హైదరాబాద్‌: విఆర్ఒ నియామక రాత పరీక్ష ఫలితాలను గురువారం టిఎస్‌పిఎస్సి వెల్లడించింది. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల మెరిట్‌ జాబితాను ప్రకటించింది. ఈ సందర్భంగా అభ్యర్థుల మార్కులు, ర్యాంకులను వెబ్‌సైట్‌లో పేర్కొంది.

రాష్ట్రవ్యాప్తంగా 700 విఆర్ఒ ఉద్యోగాల భర్తీ కోసం సెప్టెంబర్‌ 16న రాత పరీక్ష నిర్వహించారు. మొత్తం 10,58,387 మంది దరఖాస్తు చేసుకోగా.. 7,87,049 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన 7,38,885 మందికి మార్కులు, ర్యాంకులను కమిషన్‌ ప్రకటించింది. ఒక్కో ఉద్యోగానికి ముగ్గురిని ఎంపిక చేసి జిల్లాల వారీగా ధ్రువపత్రాల పరిశీలన చేపట్టేందుకు టిఎస్‌పిఎస్సి సన్నాహాలు చేస్తోంది.

 

TSPSC Released VRO results 2018