Home కామారెడ్డి బోల్తా పడిన ఆర్‌టిసి బస్సు

బోల్తా పడిన ఆర్‌టిసి బస్సు

 

 

కామారెడ్డి: ఆర్‌టిసి బస్సు బోల్తా పడిన ఘటన కామారెడ్డి జిల్లాలోని నస్రుల్లాబాద్ మండలం దుర్కిగ్రామ పరిధిలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణీకులు స్వల్పంగా గాయపడ్డారు. స్టీరింగ్ లాక్ కావడంతోనే బస్సు బోల్తా పడిందని డ్రైవర్ వివరించాడు. బోధన్ నుంచి బాన్సువాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సు పాక్షికంగా దెబ్బతింది. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది. ఆర్‌టిసి అధికారులు, పోలీసులు ఘటాన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

 

 

TSRTC Bus Roll Over in Kamareddy

Telangana news