Home రాష్ట్ర వార్తలు సందిగ్ధంలో ఆర్‌టిసి ఎన్నికలు

సందిగ్ధంలో ఆర్‌టిసి ఎన్నికలు

tsrtc2మన తెలంగాణ/ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ(టిఎస్‌ఆర్‌టిసి)లో గుర్తింపు సంఘం ఎన్నికల(వెరిఫికేషన్) నిర్వహణపై సందిగ్దత నెలకొంది. ఉమ్మడి ఆ్రంధ్రపదేశ్ ఆర్టీసీలో యూనియన్ గుర్తింపు ఎన్ని కలు 2012 డిసెంబర్ 22వ తేదీన జరగగా ఆ ఎన్నికల్లో  ఇయు (ఎంప్లాయిస్ యూనియన్-రాష్ట్ర స్థాయి), టిఎం యు( తెలంగాణ ప్రాంతం-స్థానిక స్థాయి)లు  గెలుపొం దాయి. గుర్తింపు యూనియన్  కాలపరిమితి కూడా 2015 జనవరి 2వ తేదీతో ముగిసింది.  అయితే 2014 జూన్‌లో రాష్ట్ర విభజన జరిగినప్పటికీ ఆర్ట్ట్టిసి విభజన ప్రక్రియ నేటికీ పూర్తి కాలేదు. ఈ నేపధ్యంలో ఎన్నికల నిర్వహణ విషయంలో యూనియన్ల మధ్య భిన్నాభిప్రా యాలు వ్యక్తమవుతున్నాయి. కాలపరిమితి ముగిసినం దున వెరిఫికేషన్ ఎన్నికలను నిర్వహించాలని గత ఎన్ని కల్లో స్థానిక స్థాయి గుర్తింపు పొందిన టిఎంయుతో పా టు బహుజన వర్కర్స్ యూనియన్  కోరుతుండగా సంస్థ పూర్తిస్థాయిలో విభజన జరగలేదని, గతంలో  ఓటర్లుగా ఉన్న వారు కొంత మంది బదిలీ, మరికొందరు డిప్యూ టేషన్‌పై ఎపిలో ఉన్నారని, అలాగే ఆ రాష్ట్రానికి చెందిన కొందరు అదే ప్రాతిపదికన తెలంగాణలో ఉన్నారని,  ఈ నేపధ్యంలో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని మిగిలిన యూనియన్లు పేర్కొంటున్నాయి.

విభజన విషయంలో పూర్తి స్థాయి స్పష్టత వచ్చిన తర్వాత వెరిఫికేషన్ జరపాల ని  ఆ యూనియన్లు కోరుతున్నాయి. ముఖ్యం గా తెలంగాణ రాష్ట్రంలో అధికార టిఆర్‌ఎస్ పలు ఎన్నిక ల్లో వరుసగా విజయం సాధించిననందున ఆ సాను భూతి పవనాలను ఆర్టీసీలో కూడా పని చే స్తుందని ఆ పార్టీ అనుబంధ సంస్థ టి ఎంయు ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అందులో భాగంగా నే ఆర్ట్టికి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని కార్మిక శాఖపై ఆ పార్టీ ఒత్తిడి పెంచుతోందని  పలు కార్మిక సంఘాలు మండిపడుతున్నా యి. దీంతో ఎన్నికల విషయం లో యూనియన్లు, కార్మిక శా ఖ, ఆర్టీసీ యాజమాన్యం మధ్య గత కొంత కాలంగా లేఖల యుద్ధం కొనసా గుతోంది. ఎన్నికలు నిర్వహించాలని టిఎంయు, విభ జన  ప్రక్రియ ముగిస్తే స్పష్టత వస్తుందని ఇతర యూ నియన్లు, ఆర్టీసీ సంస్థకు, కార్మిక శాఖకు లేఖలు రాశా రు. మరోవైపు కార్మిక శాఖ ఎన్నికలు నిర్వహించేం దుకు తాము సిద్ధంగా ఉన్నామని, అందుకు అనువైన సమ యాన్ని కేటాయించాలని  ఆర్టీసీతో పాటు వివిధ యూని యన్లకు లేఖ రాసింది. అందుకు ఆర్టీసీ సంస్థ జెఎ ండి స్పందిస్తూ డిసెంబర్‌లో ఎన్నికలు నిర్వహించవచ్చని కార్మిక శాఖకు బదులి చ్చారు.

అయితే ఆస్తుల పంపిణీ మినహా  పరిపాలన, నిర్వహణకు సంబంధించిన  విష యాలలో 2015 మే నెల నుంచి తెలంగాణ, ఆ్రంధ్రపదే శ్  రాష్ట్రాల ఆర్టీసిలు వేర్వేరుగా పనిచేస్తున్నా యని కూడా జెఎండి  ఆ లేఖలో స్పష్టం చేశా రు.  దీంతో ఎన్నికల అంశం మరో  చిక్కు ముడిగా మారింది. తెలంగాణకు చెం దిన ఆర్టీసీలో మాత్రమే ఎన్నికలు నిర్వ హించేందుకు కార్మిక శాఖకు అధికా రం ఉంటుంది. ఎపిలో ఎపి కార్మిక శాఖకు అధికారం ఉంది. మరో వైపు తాత్కాలిక పద్ధతిన మాత్రమే ఉద్యోగుల విభ జన జరిగింది. ప్రస్తుతం టిఆఎస్ ఆర్ టిసిలో  అధికారు లు, ఉద్యో గులు, కార్మి కులు మొత్తం 56 వేల మంది ఉండగా అధికా రులను మినహాయిస్తే సుమారు 55 వేల మంది (ఓటర్లు)  ఎన్నికల్లో పాల్గొనేందుకు అవకాశం ఉంటుం ది. ప్రస్తుతం ఆర్టీసీలో ఎంప్లాయిస్ యూనియన్, టి ఎంయు, ఎస్‌డబ్లుఫ్, ఎన్‌ఎంయు (నాగేశ్వరరావు వర్గం), ఎన్‌ఎంయు(మహమూద్ వర్గం), కార్మిక సం ఘ్, కార్మిక పరిషత్, బహుజన కార్మి క సంఘ్, బహు జన కార్మిక యూనియన్ తదితర సంఘాలు ఉన్నాయి.  ఇదిలా ఉండగా ఆర్టీసి ఎన్నికలను రవాణ కార్యకలా పాలు తక్కువగా ఉండే  కాలం(స్లాక్ పీరియడ్)లో ఎన్నికలు నిర్వహంచడం ఆనవాయితీ. మరోవైపు ఎని కలు నిర్వహించాలంటే  కార్మిక చట్టాల ప్రకారం ప్రక్రి య చేపట్టినప్పటి నుంచి కనీసం 50 నుంచి 60 రోజుల సమయం పడుతుంది. అయితే ఎన్నికల నిర్వహణ విష యంలో అన్ని యూనియన్లు ఏకతాటిపైకి వస్తే తప్ప ఎన్నికలు జరిగే పరిస్థితి కనబడడం లేదు.

ఒక వేళ అ లాంటి పరిస్థితి ఏర్పడితే… ఇప్పటికిప్పుడు కార్మిక శాఖ ఎన్నికలను ప్రకటిస్తే… యాభై రోజుల అనంతరం అంటే  ఫిబ్రవరి మూడవ వారంలో ఎన్నికలు జరిగే అవ కాశం ఉండవచ్చు.  అయితే ఇలాంటి ఆటంకాల నేప థ్యంలో కార్మిక శాఖ ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిం చేందు కు సుముఖంగా కనిపించడం లేదు. మరోవైపు తెలం గాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే మేడా రం జాతర  ఫిబ్రవరిలోనే ఉంది. అదే విధంగా మార్చి, ఏప్రి ల్ నెలల్లో విద్యార్ధుల పరీక్షలు ఉంటాయి. ఇలాంటి సమ యాల్లో ప్రత్యేక రవాణా సౌకర్యాన్ని కల్పించే భాధ్యత ఆర్టీసిపైనే ఉంది. ఇతర యూనియన్లు కార్మిక శాఖను కలిసి వాస్తవ పరిస్థితులను వివరించాయి. అన్ని అంశా లను క్షుణ్ణంగా పరిశీలించిన కార్మిక శాఖ ఎన్నికల అం శంలో అన్ని యూనియన్లు ఒక తాటిపైకి రావడంతో పా టు సంస్థ కూడా ముందుకొస్తేనే ఎన్నికల పక్రియను మొదలు పెట్టే ందుకు అవకాశం ఉంటుందని భావి స్తోం ది.  ఇదిలా ఉండగా యూనియన్లు నిత్యం సమావేశాలు నిర్వహించుకుంటూ ఎన్నికల విషయంలో అనుసరిం చాల్సిన వైఖరిపై  చర్చోపచర్చలు చేస్తున్నాయి.