Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

జూలై 19న టిఎస్‌ఆర్‌టిసి గుర్తింపు సంఘం ఎన్నికలు

tsrtc2హైదరాబాద్: జూలై 19న టిఎస్‌ఆర్‌టిసిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయం నిర్ణయించింది. సోమవారం అశోక్‌నగర్‌లోని కార్మికశాఖ కమిషనర్ కార్యాలయంలో టిఎస్‌ఆర్‌టిసిలోని అన్ని కార్మిక సంఘాల నేతలతో ఆ శాఖ ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. టిఎంయు, ఇయు, ఎన్‌ఎంయు సంఘాల నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలు, వర్క్‌షాపులు, కార్యాలయాల్లో పోలింగ్ నిర్వహించేందుకు నిర్ణయించారు. జూలై19న ఉదయం 5నుంచి సాయంత్రం 6వరకు ఎన్నికలు జరగనున్నాయి. అదేరోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు ఉంటుంది. కాగా, జూన్ 1వ తేదీ వరకు 6 నెలల సర్వీసు పూర్తి చేసుకున్న ప్రతి కార్మికుడు ఓటు హక్కు వినియోగించుకోవచ్చుని పేర్కొన్నారు. ఎన్నికలో మొత్తం 12 కార్మిక సంఘాలు తలపడనున్నాయి.

Comments

comments