Home ఆంధ్రప్రదేశ్ వార్తలు టిటిడి ఉద్యోగి ఆత్మహత్య

టిటిడి ఉద్యోగి ఆత్మహత్య

Suicideతిరుమల : టిటిడి జెఇఒ ఆఫీసులో అటెండర్ గా పని చేస్తున్న సంపత్ (38) అనే వ్యక్తి శుక్రవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వినాయకనగర్ లో జరిగింది. గత పది రోజులుగా సంపత్ సెలవులో ఉన్నాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు తక్షణమే సంపత్ ను రుయా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సంపత్ చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. కుటుంబ కలహాల కారణంగానే సంపత్ ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం కోసం సంపత్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

TTD Employee Committed Suicide