Home తాజా వార్తలు బాలయ్యను కలిసిన టిటిడిపి నేతలు

బాలయ్యను కలిసిన టిటిడిపి నేతలు

TTDP Leaders Met Actor Balakrishna

హైదరాబాద్ : హీరో నందమూరి బాలకృష్ణను తెలంగాణ టిడిపి నేతలు ఎల్.రమణ, పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డిలు గురువారం కలిశారు. హైదరాబాద్‌లోని సారథి స్టూడియోలో ఎన్‌టిఆర్ బయోపిక్ షూటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా టిటిడిపి నేతలు బాలకృష్ణను కలిసి ఎన్నికల ప్రచారానికి ఆహ్వానించారు. ఎన్‌టిఆర్ పార్టీ పెట్టే సీన్ తీస్తున్న సమయంలో వీరు బాలకృష్ణను కలిశారు. దీంతో వారు గత స్మృతులను నెమరేసుకున్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారానికి వచ్చేందుకు బాలకృష్ణ సానుకూలత వ్యక్తం చేసినట్టు టిటిడిపి నేతలు తెలిపారు.

TTDP Leaders Met Actor Balakrishna