Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

ఉద్యోగాలు లేవంట…జీవాలతో బతకాలంట

టి టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి

                    Revanth-Reddy

నందిపేట: ఉద్యమ సమయంలో తెలంగాణా వస్తే ఇంటికో ఉద్యోగమంటూ నీతులు చెప్పిన కెసిఆర్ ఇప్పుడు ఉద్యోగాలు అడిగితే గొర్రెలు, బర్రెలు, పందులు వంటి జీవాలను పెంచుకోమంటున్నాడని టి టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. బిసిలకు దామాషా ప్రకారం రిజర్వేషన్లు కోరుతూ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి రాజా రాం యాదవ్ చేపట్టిన రెండు రోజుల దీక్షను రాజారాం యాదవ్‌కు నిమ్మ రసం ఇచ్చి విరమింపజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీమాంధ్ర పాలకుల చేతిలో నుండి మన రాష్ట్రం వేరుకావాలన్న కెసిఆర్ పిలుపుతో జిల్లాలోని 9 నియోజకవర్గాలలో అర్హతలేని వారిని కూడా ఎంఎల్ ఎలుగా గెలిపించి ఆయన కూతురును ఎంపిగా గెలిపించినా జిల్లా భవితవ్యం బాగు పడ లేదన్నారు.

ఆనాడు నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్‌లైన్ పేరుతో అధికారంలోకి వచ్చిన కెసిఆర్ ఇప్పుడు అవి ఎక్కడికి వెళ్లాయో చెప్పడం లేదన్నారు. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు తినే సన్నబియ్యమే కెసిఆర్ మన వడు తింటున్నాడని సిఎం కెసిఆర్ చెబుతున్నాడని మరి గొర్రెలు, బర్రెలు, పందుల పెంపకం కూడా గౌరవప్రదమైన వృత్తే అయితే నీ మనవడితో కూడా పందులు పెంచుతూ ఆదర్శం గా నిలవాలని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వ్యవసాయం దీనస్థితికి వెళ్ళిందని పంటలకు మద్దతు ధరలేక నష్టాలు వస్తున్నాయన్నారు. బిసి సం క్షేమ సంఘం జాతీయ నాయకులు కృష్ణయ్య మాట్లా డుతూ బిసిలకు 70 ఏళ్లుగా అన్యాయం జరుగుతూనే ఉందన్నారు. రిజర్వే షన్లు ఎవరో ఇచ్చే బిక్ష కాదు- మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కన్నారు. ఈ కార్యక్రమంలో రాజారాంయాదవ్, అరికెల నర్సారెడ్డిలు మాట్లాడారు. నాయకులు రాజేశ్వర్, యాదాగౌడ్, కాటిపల్లి గంగారెడ్డి, లక్ష్మీనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments