Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

ఇళ్లపై కూలిన కార్గో విమానం

cargo-crashబిష్కెక్ : కిర్గిజిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుం ది. మనాస్ విమానాశ్రయం సమీపంలో  సోమవారం ఉదయం టర్కీష్ ఎయిర్‌లైన్స్ కార్గోకు చెందిన బోయింగ్ విమానం జనా వాసాలపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో కనీసం 37 మంది మరణించారని కిర్గిజ్ ప్రభుత్వం ప్రకటించింది. గాయాలపాలైన మరో 15మందిని వేర్వేరు ఆస్పత్రులో చేర్పించారు. వీరిలో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. సహాయక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు. ఓ పైలట్, మరో 29 మంది మృతదేహాలను వెలికితీశారు. ఇళ్లపై విమానం కూలిపోవడంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది. మృతుల్లో స్థానికులే ఎక్కువగా ఉన్నారు. ఈ ప్రమాదంలో చాలామంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. కాగా ప్రమాద సమ యంలో విమానంలో ఎంతమంది ఉన్నారు, ఎక్కడకు వెళ్తోంది వంటి విషయాలు తెలియరాలేదు.

Comments

comments