Search
Sunday 18 November 2018
  • :
  • :

పసుపు బోర్డ్ ఏర్పాటు చేయాలి: కవిత

KAVITHA

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి పసుపు బోర్డ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నామని ఎంపి కవిత తెలిపారు. గతంలో అనేక సార్లు కేంద్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు. కేంద్రం పసుపు సెల్ ఏర్పాటు చేసిందన్నారు. పసుపుకు మద్దతు ధర కల్పించాలని విజ్ఞప్తి చేశామన్నారు. జాతీయ స్థాయిలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని, రబ్బర్, సిల్క్ బోర్డు ఏర్పాటు చేసిన విధంగానే పసుపు బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. ఆరు శాతం మాత్రమే పసుపు ఎగుమతులు జరుగుతున్నాయని, పసుపు ఎండబెట్టేందుకు యంత్రాలు అందుబాటులో ఉన్నాయో అధ్యయనం చేయాలని సూచించారు. మేలైన రకాల పసుపు సీడ్స్‌ను కేంద్ర ప్రభుత్వం అందించాలని కోరారు.

Comments

comments