Search
Tuesday 20 November 2018
  • :
  • :

నా లైఫ్‌కు టర్నింగ్ పాయింట్ ‘అ..ఆ’: నితిన్

nithi-a-aaత్రివిక్రమ్ దర్శకత్వంలో శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై నితిన్, సమంత జంటగా ఎస్.రాధాక్షష్ణ (చినబాబు) నిర్మించిన చిత్రం ‘అ..ఆ’. ఈ సినిమా ఇటీవల విడుదలై ఘన విజయాన్ని సాధించిన సందర్భంగా చిత్ర యూనిట్ గుంటూర్‌లో అభిమానుల సమక్షంలో విజయోత్సవాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ “ఈ సినిమాను తీసేటప్పుడు మామూలు కథను బలంగా చెప్పాలి. ఎక్కువ మలుపు ఏవీ ఉండకూడదు. రక్తపాతం ఉండకూడదు. మన కుటుంబ సభ్యుల మధ్య ఉండే చిన్న చిన్న విషయాలు ఎందుకు చెప్పకూడదు అని అనుకున్నాను. నేను దర్శకుడికంటే ముందు రచయితను… అంతకంటే ముందు మధ్యతరగతి వ్యక్తిని. సినిమాలో సున్నితంగా ఉండే వినోదం ఎందుకివ్వలేం అనిపించింది. బిరియాని, మసాలాలు తిన్న మనకు ఎప్పుడైనా ఫుడ్ పాయిజనింగ్ అయితే డాక్టర్ చారన్నం తినమంటాడు. నా దృష్టిలో ఈ సినిమా చారన్నలాంటిది. ఎక్కువ పులుపు, ఉప్పు ఉండదు”అని అన్నారు. నితిన్ మాట్లాడుతూ “ఈ సినిమాలో ప్రతి ఆర్టిస్టుకు సమానంగా పేరు వచ్చింది. అలా రావడానికి కారణం డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాసే. ఈ సినిమాకు త్రివిక్రమ్ అసలైన హీరో. మిక్కీ వండర్‌ఫుల్ మ్యూజిక్‌నిచ్చాడు. ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధించి నా లైఫ్‌కు మంచి టర్నింగ్ పాయింట్ అయింది”అని తెలిపారు. దిల్‌రాజు మాట్లాడుతూ “నిర్మాత చినబాబుతో ఉన్న పరిచయంతో ఈ సినిమా నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులు తీసుకున్నాను. ఈ సినిమా మ్యాజిక్ చేసి రికార్డు కలెక్షన్లను వసూలు చేస్తోంది. నితిన్‌ను 50 కోట్ల క్లబ్‌లోకి తీసుకెళ్లినందుకు త్రివిక్రమ్‌కు థాంక్స్. నితిన్ టార్గెట్ ఇప్పుడు వంద కోట్లు. ప్రతి ఒక్కరి నుండి మంచి నటనను రాబట్టుకొని సినిమాను పెద్ద సక్సెస్ చేసిన త్రివిక్రమ్‌కు స్పెషల్ థాంక్స్. ఈ సినిమా ఓవర్సీస్‌లో 2.5 మిలియన్ మార్క్‌ను టచ్ చేయబోతోంది”అని చెప్పారు. కథానాయిక అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ “ఇలాంటి మంచి మూవీలో నేను భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. త్రివిక్రమ్‌కు చాలా థాంక్స్‌”అని అన్నారు. ఈ కార్యక్రమంలో నదియా, శ్రీనివాసరెడ్డి, అజయ్, హరితేజ, పమ్మి సాయి, మధునందన్, కృష్ణచైతన్య తదితరులు పాల్గొన్నారు.

Comments

comments