Home తాజా వార్తలు రోడ్డు ప్రమాదంలో టివి నటి మృతి

రోడ్డు ప్రమాదంలో టివి నటి మృతి

Rekha

చెన్నయ్ : కన్నడ టివి నటి రేఖా సింధు శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఈ ప్రమాదం చెన్నయ్ – బెంగళూరు జాతీయ రహదారిపై జరిగింది. చెన్నయ్ నుంచి బెంగళూరు వెళుతుండగా ఆమె ప్రయాణిస్తున్న కారు పెర్నాంబట్ సమీపంలో ప్రమాదానికి గురైంది. ఆమెతో పాటు కారులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురు కూడా చనిపోయారు. మృతులు అభిషేక్ కుమారన్ (22), జయచంద్రన్ (23), రక్షణ్ (20) మృతదేహాలను తిరుపత్తూర్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తమిళ, కన్నడ టివి సీరియల్స్, షోల ద్వారా రేఖా సింధు ప్రసిద్ధికెక్కారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.