Home జాతీయ వార్తలు టివి నటి ఆత్మహత్య…

టివి నటి ఆత్మహత్య…

succide

కోల్‌కతా: కోల్‌కతా నగరంలో ఓ టివి నటి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.మౌమిత సాహా(23) అనే నటి తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి తలుపులు తెరవకపోవడంతో ఇంటి యజమానికి అనుమానం వచ్చి పోలీసులకు ఫోన్ చేశాడు. దీంతో పోలీసులు అక్కడకి చేరుకొని తలుపులు తెరవగా సీలింగ్ ఫాన్‌కు ఆమె మృతదేహం వేలాడుతూ కనిపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, ఆమె ఆత్మహత్య చేసుకుందా? లేక ఎవరైనా హత్య చేశారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గదిలో ఆమె రాసిన ఒక లేఖ కనిపించింది. సోషల్ మీడియాలో ఆమె ఖాతాను పరిశీలించామని, చివరగా ఆమె పెట్టిన పోస్ట్ మానసిక ఒత్తిడితోనే రాసినట్లు కనిపించిందని.. ఆమె ఫోన్ కాల్స్ కూడా పరిశీలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.