Home జనగామ రోడ్డు ప్రమాదం.. యాంకర్ లోబోకు గాయాలు

రోడ్డు ప్రమాదం.. యాంకర్ లోబోకు గాయాలు

TV Anchor Lobo Car met with an Accident in Jangaon

జనగామ: ప్రముఖ టివి యాంకర్ లోబో(మహ్మద్ కయిమ్) ప్రయాణిస్తున్న కారు జనగాం జిల్లా రఘునాథపల్లి మండలం నిడివిగొండ గ్రామ శివారులో ప్రమాదానికి గురైంది. ఆటోను కారు ఢీకొనడంతో లోబోతో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రులను చికిత్స కోసం జనగాం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలిని చేరుకొని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.