Search
Wednesday 14 November 2018
  • :
  • :

బుల్లితెర కమెడియన్ అరెస్ట్!

Crime-image
చిత్తూరు: బుల్లితెరపై కమెడియన్ గా టివిల్లో కనిపించాడు. డబ్బుపై మోజుతో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ హరిబాబు కోట్లు  సంపాదించాడు. మొత్తానికి మంగళవారం తిరుపతి టాస్క్ ఫోర్స్  పోలీసులకు చిక్కాడు. కొన్ని రోజులుగా నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. గతంలో  బతుకుదెరువు కోసం తిరుపతిలో చిరుద్యోగిగా హరిబాబు పనిచేశాడు. అశించిన జీతం సరిపోకపోవడంతో టివి సీరియల్స్ లో చిన్నచిన్న పాత్రలు కూడా చేసేవాడు. ఆ తర్వాత మెల్లిగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ కోట్లకు పడగలెత్తాడు. అలా కూడగట్టిన సొమ్ముతో ఇటీవలే ఓ సినిమాకు పెట్టుబడి కూడా చేశాడు. దీంతో టాస్క్ ఫోర్స్ సిఐ మధుబాబు అధ్వర్యంలో హరిబాబును అదుపులోకి  తీసుకొని విచారిస్తున్నారు. హరిబాబుపై 10 పోలీస్ స్టేషన్లలో 13కు పైగా కేసులు ఉండటం గమనార్హం.

Comments

comments