Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

చాయిస్ ఈజ్ యువర్స్.. విషమా? ఉరితాడా?

TVVS Supporters Satirical Comments on AIADMK MP

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో కావేరీ జల వివాదం ఎంతటి సంచలనం సృష్టిస్తోంది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ వివాదంపై అధికార, ప్రతిపక్ష నేతలు ఒకరిని మించి మరొకరు వ్యాఖ్యాలతో వార్తల్లో నిలుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే కావేరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు(సిఎంబి)ని ఏర్పాటు చేయాలంటూ అధికార ఎఐఎడిఎంకె ఎంపిలు గత కొన్నిరోజులుగా పార్లమెంట్‌లో ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు సూచన మేరకు మార్చి 29లోగా సిఎంబి ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో పార్లమెంట్‌లోనే బలవన్మరణానికి పాల్పడుతానని ఎంపి నవనీత కృష్ణన్ కొన్ని రోజుల కిందట ప్రకటించారు.

ప్రస్తుతం ఆ గడువు ముగియడంతో ఎంపిగారి ప్రకటనపై దినకరన్ వర్గీయులు సెటైర్లతో విరుచుకుపడుతున్నారు. దీనిలో భాగంగా శనివారం దినకరన్ వర్గంలోని కీలక నేత పుహళేంది మీడియా సమావేశంలో మాట్లాడుతూ… గడువు రాష్ట్రానికి న్యాయం జరగని పక్షంలో ఆత్మహత్య చేసుకుంటానని మన ఎంపిగారు చెప్పారు. గడువు ముగిసినా కేంద్రం స్పందించలేదు. ఆయన మాటమీద నిలబడాలి. ఇదిగో ఉరితాడు.. విషం.. రెండిట్లో మీకు నచ్చింది తీసుకోండి అంటూ పుహళేంది ఆవేశంగా చెప్పారు. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి.

Comments

comments