Search
Saturday 22 September 2018
  • :
  • :

శ్రీదేవి పోస్టుమార్టం నివేదిక

Death-Certificate-of-Sridev

దుబాయ్: నటి శ్రీదేవి పోస్టుమార్టం నివేదిక కొద్దిసేపటి క్రితం బయటకు వచ్చింది. దీంట్లో శ్రీదేవిది సహజ మరణమేనని దుబాయ్ ఆరోగ్యశాఖ పేర్కొంది. ప్రమాదవశాత్తు శ్రీదేవి మృతి చెందినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వైద్యులు పేర్కొన్నారు. బాత్‌టబ్‌లో పడి ఊపిరాడక ఆమె మరణించినట్లు వెల్లడించారు. అంతేగాక ఆమె రక్త నమూనాలో ఆల్కాహాల్ ఉన్నట్లు గుర్తించామని వైద్యులు తెలిపారు. ఇక పోస్టుమార్టం రిపోర్టులో ఆమె పేరును శ్రీదేవి బోనీకపూర్ అయ్యప్పన్‌గా పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు చనిపోయిందని చెప్పడానికి Accidental Drowning బదులు Accidental Drawning అని ఉంది. దీంతో ఎంతో ముఖ్యమైన పోస్టుమార్టం నివేదికలో అచ్చుతప్పులు ఉండటం కొత్త అనుమానాలకు తావిస్తోంది. అంతేగాక ఆమె గుండెపోటుతో చనిపోయినట్లు సంజయ్ కపూర్ చెప్పారు. కానీ పోస్టుమార్టం నివేదికలో ఆ విషయం లేకపోవడం మరిన్ని సందేహాలను రేకెత్తిస్తోంది.

Twist in Postmortem Report of Sridevi.

Comments

comments