Search
Thursday 15 November 2018
  • :
  • :

అత్యాచారం కేసులో ఇద్దరికి ఉరిశిక్ష

Two Accused Awarded Death Sentence in Mandsaur Rape Case

భోపాల్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మంద్‌సౌర్ బాలిక (7) అత్యాచారం కేసులో నిందితులకు స్థానిక కోర్టు ఉరిశిక్ష విధిస్తూ మంగళవారం తీర్పు చెప్పింది. ఈ ఘటన జరిగిన రెండు నెలలలోపే నిందితులకు శిక్ష ఖరారు చేయడంపై దేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్‌లో జూన్ 24న దుండగులు ఓ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు ఆస్పత్రిలో కోలుకుంది. సిసిటివి ఫుటేజీల ఆధారంగా ఇర్ఫాన్ (20), ఆసిఫ్ (24)లను నిందితులుగా గుర్తించి అరెస్టు చేశారు. ఈ కేసును విచారించిన రెండో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి నిషా గుప్తా నిందితులిద్దరికి ఉరిశిక్ష విధిస్తూ ఈ రోజు తీర్పు చెప్పారు.

Two Accused Awarded Death Sentence in Mandsaur Rape Case

Comments

comments