Home జాతీయ వార్తలు తుపాకీతో కాల్చుకుని ఇద్దరు ఎఎస్‌ఐల ఆత్మహత్య

తుపాకీతో కాల్చుకుని ఇద్దరు ఎఎస్‌ఐల ఆత్మహత్య

Cameted-suside

న్యూఢిల్లీ: ఢిల్లీలోని చాణక్యపురి, సివిల్ లైన్స్‌లలో జరిగిన వేర్వేరు ఘటనల్లో తుపాకీతో కాల్చుకుని ఇద్దరు అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. శనివారం ఉదయం మూడో బెటాలియన్‌కు చెందిన టిపి అనిరుధ్ (52) తన కుడి కణితికి తుపాకీ గాయం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అతని సర్వీస్ పిస్టోల్, మోటార్ బైక్, హెల్మెట్ ఆయన మృతదేహం దగ్గర పడిపోయింది. ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందో కుటుంబ సభ్యులకు సైతం తెలియదు. ఘటనా స్థలంలో ఎలాంటి లేఖ లభించలేదని పోలీసులు తెలిపారు. మరో ఘటనలో  ఢిల్లీ పోలీస్ కంట్రోల్ రూంలో విధులు నిర్వహిస్తున్న హనుమాన్ సామే (52), తలపైన కాల్చుకుని మృతి చెందారని పోలీసులు తెలిపారు. మానసిక ఒత్తిడితో బాధపడుతున్న సామే గత నాలుగైదు ఏళ్లుగా ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో చికత్స పొందుతున్నారు.