Home వార్తలు ప్రభుత్వ కార్యాలయంలోనే వీరంగం!

ప్రభుత్వ కార్యాలయంలోనే వీరంగం!

ఒకే స్థలం ఇద్దరికి రిజిస్ట్రేషన్

రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద ఘర్షణ
బిజెపి నేతల హల్‌చల్…

పరస్పరదాడులు కేసులు నమోదు
land-mafia2మన తెలంగాణ/సిటీబ్యూరో: మాదన్నపేటలోని ఓ స్థలం ఖరీదు విషయంలో బిజెపికి చెందిన ఇరువర్గాలు మూసారాంబాగ్‌లోని రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు మలక్‌పేట పోలీసులు కేసులు నమోదు చేశారు. మాదన్నపేటలోని ఒకే స్థలాన్ని పుష్పలీల, సుధీర్ అనే వ్యక్తులు అగ్రిమెంట్ చేసుకున్నారు. స్థలయజమానులు ఆరుగురిలో ముగ్గురు పుష్పలీలకు, మరో ముగ్గురు సుధీర్‌కు అగ్రిమెంట్ చేసుకున్నారు. శుక్రవారం ఒకే స్థలంపై ఇరువర్గాలు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు మూసారాంబాగ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి చేరుకోగానే ఒకే స్థలాన్ని ఇద్దరికి ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారంటూ పరస్పరం గొడవకు దిగారు. ఈ గొడవలో బిజెపి నేతలు సుధీర్, మల్లేష్, పుష్పలీలలు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. దీంతో ఈ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను సముదాయించారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు పోలీసులు పరస్పరం కేసులు నమోదు చేశారు.