Search
Saturday 17 November 2018
  • :
  • :

విషవాయువులు పీల్చి సోదరుల మృతి…

Dead

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఓ షాపింగ్ మాల్ లో ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది. షాపింగ్ మాల్ లో మురుగును శుభ్రం చేసేందుకుగాను డ్రైనేజీలో దిగిన ఇద్దరు సొదరులు మృత్యువాతపడ్డారు. మురుగును శుద్ధి చేస్తుండగా విషవాయువులు వెలువడి సోదరులిద్దరూ మృతి చెందిన ఈ దుర్ఘటన  తూర్పు ఢిల్లీలోని ఆనంద్‌విహార్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది.

ఘటన వివరాల్లోకి వెళితే… ఢిల్లీకి చెందిన యూసుఫ్‌ తన ఇద్దరు కుమారులు జహంగీర్‌, ఇజాజ్‌తో కలిసి ఓ షాపింగ్‌మాల్‌లో మురుగు శుద్ధి చేసేందుకని లోపలికి దిగారు. అయితే ఎంత సేపటికి కుమారులు తిరిగిరాకపోవడంతో ఆయన స్థానికులతో పాటు పోలీసు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించారు.

వారిని కాపాడేందుకు యత్నించిన అగ్నిమాపక అధికారి ఒకరు సైతం విషవాయువుల బారిన పడి అక్కడే కుప్పకూలిపోయాడు. దాంతో బాధితులను హుటాహుటిన సమీపంలోని అస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలో జహంగీర్‌ చనిపోయాడు. ఇంతియాజ్ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ప్రస్తుతం  మృతుల తండ్రి, అగ్నిమాపక అధికారి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు సమాచారం.

Comments

comments