Search
Sunday 18 November 2018
  • :
  • :

రైల్వే స్టేషన్ లో జవాన్ల సామాన్లు చోరీ

bsf-jawanన్యూఢిల్లీ : వెయిటింగ్ రూమ్‌లో ఇద్దరు బిఎస్‌ఎఫ్ జవాన్లకు సంబంధించిన వస్తువులను చోరీ చేసిన ఘటన ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో శనివారం చోటుచేసుకుంది. బాదితుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై డివిజినల్ రైల్వే మేనేజర్ విచారణ చేపట్టారు. జవాన్లు నిద్రిస్తున్నసమయంలో  ఈ చోరీ జరిగినట్టు బాధిత బిఎస్‌ఎఫ్ జవాను సుధాకర్ తివారీ చెప్పారు. సాధారణంగా తాము ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటామన్నారు. కానీ వెయిటింగ్ రూమ్ లో భద్రత ఎక్కువ ఉంటుందని భావించి కొద్దిగా రిలాక్స్ అయ్యాం, కానీ మా వస్తువులను ఎవరో ఎత్తుకెళ్లినట్టు వాళ్లు పేర్కొన్నారు.

Comments

comments