Home సూర్యాపేట శరవేగంగా రెండు పడకల పనులు

శరవేగంగా రెండు పడకల పనులు

bed

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణ పనులు జిల్లాలో శర వేగంగా జరుగుతున్నట్లు జిల్లా కలెక్టర్ కె.సురేంద్రమోహన్ తెలిపారు. బుధవారం హడ్కో డిజిఎం రహిముద్దీన్, ట్రైనీ ఆఫీసర్ సురేష్‌కుమార్ జిల్లా కలెక్టర్‌ను కలిసిమాట్లాడారు.

మన తెలంగాణ/సూర్యాపేట : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణ పనులు జిల్లాలో శరవేగంగా జరుగుతున్నట్లు జిల్లా కలెక్టర్ కె.సురేంద్రమోహన్ తెలిపారు. బుధవారం హడ్కో డిజిఎం రహిముద్దీన్, ట్రైనీ ఆఫీసర్ సురేష్‌కుమార్ జిల్లా కలెక్టర్‌ను కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంతిర గత అక్టోబర్ మాసంలో జిల్లా పర్యటనలో భాగంగా స్థానిక గొల్ల బజార్ నందు నిరుపేదలకు కోసం నిర్మించిన 192 రెండు పడకల  గదుల ఇండ్ల గృహ సముదాయాన్ని  ప్రారంభించారని, లబ్ధిదారులకు లాటరీ పద్దతిలో ఇండ్లు కేటాయించడం జరిగిందని వివరించారు. అలాగే రాష్ట్ర ఐ.టి.శాఖ మంత్రి కె.తారకరామారావు ఆదేశాల మేరకు జమునా నగర్‌లో ఒక్క ని రు పేదకు రెండు పడక గదుల లింటిని మంజూరు చేయటం జరిగిందని తెలిపారు. సూర్యాపేట మున్సిపాలిటీలో రెండు పడక గదుల ఇండ్ల కొరకు దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయని తెలుపుతూ 15 రెవెన్యూ బృందాలు ప్రభుత్వ నిబంధనలకు లోబడి పరిశీలించిన పిదప 1500 మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. పెన్‌పహాడ్ మండలం సింగరెడ్డిపాలెంలో 102 ఇండ్లు, చివ్వెంల మం డలం తిరుమలగిరి గ్రామంలో 80 ఇండ్లు అలాగే కేసారం గ్రామంలో 384 ఇండ్ల పనులు పురోగతిలో ఉన్నాయని అన్నారు. ఇండ్ల నిర్మాణంకు ఇసుక ఉచితంగా కల్పించడం జరుగుతుందని, ఫ్లై యాష్ ఇటుకలు వాడుతున్నట్లు అలాగే జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నందున ఇండ్ల నిర్మాణం కొరకు సిమెంట్‌ను తక్కువ ధరకు సరఫరా చేయిస్తున్నట్లు తెలిపారు. అలాగే జిల్లాలో స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్లు నిర్మించటం జరుగుతుందని కలెక్టర్ వివరించారు.  అనంతరం చివ్వెంల మండలం తిరుమలగిరి గ్రామంలో నిర్మిస్తున్న 80 రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణ పనులను హడ్కో డిజిఎం రహిముద్దీన్, డిఆర్‌వో యాదిరెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా డిజిఎం మాట్లాడుతూ ఇండ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఈ.ఈ.ఆర్ బి యాదగిరి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.