Search
Wednesday 21 November 2018
  • :
  • :

రెండు బస్సులు డీ

34 మందికి గాయాలు, ఆరుగురు విషమం
మెదక్ జిల్లా జహీరాబాద్ వద్ద ప్రమాదం

accidentజహీరాబాద్: సంగారెడ్డి జిల్లా కొ త్తూర్ (బి) గ్రామ శివారులోని నారింజా వంతెన వద్ద శుక్రవారం రెండు ఆర్‌టిసి బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురి పరిస్థితి విష మంగా ఉంది. జహీరాబాద్ రూరల్ ఎస్‌ఐ శ్రీకాంత్ వివరాల ప్రకారం.. సంగారెడ్డి డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ వైపు వస్తుండగా ఎదురుగా బీదర్ పట్ట ణం వైపు వెళ్తున్న హైదరాబాద్ డిపోకు చెందిన ఢీకొ ట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్లు, కండక్టర్లకు బలమైన గాయాలు కాగా, మొత్తం 34 మందికి గా యాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన జ హీరాబాద్ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. డ్రైవ ర్లు, కండక్టర్ల పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ లోని ఆర్‌టిసి ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ వివరిం చారు. ప్రమాదానికి కారణమైన హైదరాబాద్ డిపో డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు వివరించారు.
క్షతగాత్రులకు ఎంఎల్‌సి పరామర్శ
రోడ్డు ప్రమాదంలో గాయపడి జహీరాబాద్ ప్రాంతీ య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఎంఎల్‌సి ఎండి ఫరీదుద్దీన్, మున్సిపల్ చైర్మన్ ము త్యాల లావణ్య చందు, జహీరాబాద్ తహసీల్దార్ నవీ న్ వేర్వేరుగా ఆస్పత్రికి చేరుకుని పరామర్శించారు. వారికి చికిత్సలు అందుతున్న తీరుపై వైద్యులను అ డిగి తెలుసుకున్నారు. ఇదిలాఉంటే స్వల్ప గాయప డిన మరో 20మంది ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం వెళ్లిపోయారు. క్షతగాత్రులకు పరిహారం అందేలా ఉన్నతాధికారులకు నివేదికను అందచేయ నున్నట్లు తహసీల్దార్ నవీన్ ‘మన తెలంగాణ’కు వివరించారు.

Comments

comments