Home తాజా వార్తలు కృష్ణా నదిలో కొట్టుకొచ్చిన చిన్నారుల మృతదేహాలు

కృష్ణా నదిలో కొట్టుకొచ్చిన చిన్నారుల మృతదేహాలు

krishna-river

విజయవాడ : కృష్ణా నది ఒడ్డుకు ఇద్దరు పిల్లల మృతదేహాలు కొట్టుకువచ్చాయి. తాడేపల్లి సీతానగరం వద్ద కృష్ణానదిలో కొట్టుకువచ్చిన రెండు మృతదేహాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. మృతులు కృష్ణలంక ప్రాంతానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.