Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

భవనం పైనుంచి పడి ఇద్దరు చిన్నారుల మృతి

Two Children Die Falling Off Building

హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే క్వార్టర్స్‌లో విషాదం చోటు చేసుకుంది. భవనం పైనుంచి పడి ఇద్దరు చిన్నారులు చనిపోయారు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. భవనం పైనుంచి ప్రమాదవశాత్తూ 18 నెలల వయస్సు ఉన్న చిన్నారి శ్రావ్య కిందపడింది. ఆమెను కాపాడే యత్నంలో మరో బాలిక సైతం కిందపడి తీవ్రంగా గాయపడింది. ఈ ప్రమాదంలో చిన్నారి శ్రావ్య అక్కడికక్కడే చనిపోగా, బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందింది. ఈ ఘటనతో ఈ ప్రాంతంలో విషాదం అలుముకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Two Children Die Falling Off Building

Comments

comments