Home నాగర్ కర్నూల్ చెరువుకు స్నానానికి వెళ్లి ఇద్దరు మృతి

చెరువుకు స్నానానికి వెళ్లి ఇద్దరు మృతి

Died

అచ్చంపేట: చెరువులో స్నానానికి వెళ్లి నీట మునిగి ఇద్దరు మృతి చెందిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం లింగోటంలో విషాదం నింపింది. వివరాల్లోకి వెళ్తే. సూర్యాపేట జిల్లాకు చెందిన దుర్గయ్య, ఇందిరమ్మ, యాదగిరి, ఎర్రమ్మ దంపతులు కొన్నేళ్ల క్రితం జీవనోపాధి కోసం లింగోటం గ్రామానికి వలస వచ్చారు. ఆదివారం వీరి పిల్లలు నందిని (14), శ్వేత (7) స్నానం చేసేందుకు సమీపంలోని చెరువు వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో వీరిద్దరూ నీట మునిగి మృతి చెందినట్లు కుటుంబసభ్యులు చెప్పారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.