Home తాజా వార్తలు చెరువులో మునిగి ఇద్దరు చిన్నారులు మృతి

చెరువులో మునిగి ఇద్దరు చిన్నారులు మృతి

Drown In Pondనాగర్‌కర్నూల్ : చెరువు వద్ద ఆడుకునేందుకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోయారు. ఈ ఘటన అచ్చంపేట మండలం బొమ్మన్‌పల్లి గ్రామంలో శనివారం ఉదయం చోటు చేసుకుంది. చెరువు నుంచి మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో బొమ్మన్ పల్లి గ్రామంలో విషాదం నెలకొంది. మృతి చెందిన చిన్నారుల వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Two Children Died With Drown In Pond